28.2 C
Hyderabad

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

హై బీపీ, షుగర్ వ్యాధితో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, ఆహార నియమాలు పాటించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోని నాలుగవ అంతస్తులో గల డయాలసిస్ కేంద్రం లో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కేక్ కట్ చేసి డయాలసిస్ రోగులందరికీ వరల్డ్ కిడ్నీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలుతెలిపారు. అలాగే డయాలసిస్ వరకు రాకుండా ప్రతి ఒక్కరూ కేర్ తీసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జలగం తిరుపతి రావు, డాక్టర్ సాయిరాం, డాక్టర్ రాజశేఖర్, ఆయుష్ విభాగం వైద్యులు డాక్టర్ జె.గంగా దాస్, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ తిరుపతి, నర్సింగ్ సూపరిండెంట్ చంద్రకళ, డయాలసిస్ మేనేజర్ కరుణాకర్, ఇంచార్జ్ మమత, డయాలసిస్ రోగులు, డయాలసిస్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article