26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పాల్గొన్న సినీ డైరక్టర్లు శైలేష్ కొలను, బొమ్మరిల్లు భాస్కర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి ఇందూర్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు దేవనాథ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతుండగా యజ్ఞాచార్యులు లక్ష్మణస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ చార్యులు, సంపత్ కుమార్ ఆచార్యులు నిర్వహిస్తున్నారు. బుధవారం నాటి బ్రహ్మోత్సవాల్లో హిట్-1, హిట్-2 సినిమాల దర్శకుడు శైలేష్ కొలను తో పాటు బొమ్మరిల్లు సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, ప్రముఖ ఛాయాగ్రహకులు విజయ చక్రవర్తి, సినీ నిర్మాతలు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, మహేందర్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజు, శిరీష్ రెడ్డి దంపతులు, ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, మాజీ ఎంపీటీసీ రాములు, రాజేశ్వర్, నరాల సుధాకర్, పృథ్వి, ప్రవీణ్, సాయిలు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Ongoing Brahmotsavams

More articles

Latest article