24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంఈఓ

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ

 

ఇందల్వాయి మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను మండల విద్యాశాఖ అధికారి ఎస్.గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండలంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పనిచేయడం చాలా గర్వకారణంగా ఉందని ఎంఈఓ అన్నారు. అలాగే మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ఆడపిల్లల్ని ఉన్నంతగా చదివించినప్పుడే సంపూర్ణమైన సాధికారత సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, మాధురి, రేఖా, రజినిలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు సంబరాలలో పాల్గొని నాట్యము, ఏకపాత్రాభినయనం, మిమిక్రీ సాంస్కృతిక కార్యక్రమాలు లో పాల్గొన్నారు. గన్నారం గ్రామ సర్పంచ్ కర్ణం సుజాత శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అనేక రకాలుగా సహాయపడుతున్నారని కొనియాడారు. గన్నారం గ్రామ మహిళ వార్డు మెంబర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. కార్యక్రమ నిర్వహణ కు పీఆర్టియు ఇందల్వాయి మండల శాఖ అధ్యక్షులు భార్గవ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తోడ్పాటునందించి ఏర్పాట్లు చేశారు. ఇంకా మండలంలోని బీసీటీయూ అధ్యక్షులు వినోద్, గంగా మోహన్, ఎస్సీ ఎస్టీ యూనియన్ గంగాధర్, విజయ్ కుమార్, అవదేశ్ పంతులు, మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article