అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంఈఓ
ఇందల్వాయి, బతుకమ్మ ఇందల్వాయి మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను మండల విద్యాశాఖ అధికారి ఎస్.గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండలంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పనిచేయడం చాలా గర్వకారణంగా ఉందని ఎంఈఓ అన్నారు. అలాగే మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ఆడపిల్లల్ని ఉన్నంతగా చదివించినప్పుడే సంపూర్ణమైన సాధికారత సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, మాధురి, రేఖా,...