30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బతుకమ్మ ఎఫెక్ట్

 

రుద్రూర్ బతుకమ్మ :

 

మెడికల్ షాపుల్లో “ఫార్మాసిస్టు లేకుండా మెడికల్ షాపుల నిర్వహణ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నిద్రమత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ” అనే శీర్షికపై బతుకమ్మ పత్రికలో బుధవారం ప్రచురితమైన వార్త కథనానికి  డ్రగ్ ఇన్స్పెక్టర్లు స్పందించి రుద్రూర్ మండల కేంద్రంలోని మెడికల్ షాపులను తనిఖీలు చేశారు. మెడికల్ షాపులోని పలు రికార్డులను పరిశీలించారు. కాలం చెల్లిన మందులను విక్రయించరాదని, మెడికల్ షాప్ నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు పాటించాలని, షెడ్యూల్ హెచ్ మందులు, యాంటీ బయోటిక్ వంటి మందులు డాక్టర్ చీటి లేకుండా ఇవ్వకూడదన్నారు. ఉల్లంఘించిన వారి పై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీలత, శ్రీకాంత్ లు ఉన్నారు.

 

Drug inspectors inspect medical stores

More articles

Latest article