28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహించుకున్నాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇఫ్తార్ విందులో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ హయంలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహించుకున్నామని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని అల్ హమ్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

We have celebrated all festivals irrespective of caste and religion.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు పవిత్ర పండగ అయిన రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీనే అని, కేసీఆర్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, తోఫాలు అందజేయడం జరిగిందన్నారు. షాదీ ముబారక్ ద్వారా చెక్కులతోపాటు నా సొంత డబ్బులతో ఆడపడుచులకు పట్టుచీర అందించానని గుర్తు చేశారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు 41 రోజుల పాటు పవిత్రంగా ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు.

 

We have celebrated all festivals irrespective of caste and religion.

 

ఈ కార్యక్రమంలో నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షెహాజాద్, మహ్మద్ మతీన్, అబ్దుల్ బారీ, సనా ఉల్లా ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమీ, అబ్దుల్ అజీజ్, మజర్ ఉద్దీన్, తజ్జముల్ ఖాన్, మహ్మద్ హఫీజ్, నయీబ్ ఖురేషి, మహ్మద్ ఇమ్త్యాజ్, యూనిస్, మహ్మద్ ఆరిఫ్, ఇమ్రాన్, మహమ్మద్ వాజీ ఉల్లా (జిల్లా అమీర్ అహ్లే హదీస్), మౌలానా తమీమ్ సాహబ్, హుస్సేన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

 

We have celebrated all festivals irrespective of caste and religion.

More articles

Latest article