. . . నిజామాబాద్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుశుబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాను బాల్య వివాహ రహిత (నిరోధ) జిల్లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం మన అందరి కర్తవ్యం గా భావించాలని నిజామాబాద్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుశుబు అన్నారు. జస్ట్ ఫర్ రైట్స్ న్యూ ఢిల్లీ వారి సౌజన్యంతో జిల్లాలో సాధనా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల్య వివాహ నిరోధ రథయాత్ర 100 రోజుల కార్యక్రమం జిల్లాలో ఫిబ్రవరి 17 న ప్రారంభమై మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ముగియటం చాలా ఆనందదాయకమని కుశుబు అన్నారు. సోమవారం కోర్టు సముదాయంలోని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయం ఎదుట బాల్య వివాహ నిరోధ రథయాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రారంభమైన బాల్య వివాహ నిరోధయాత్ర జిల్లాలోని బాల్యవివాహాల నిరోధానికి అవకాశము ఉన్న పలు గ్రామాలలో రథయాత్రను నిర్వహించారు. అందులో భాగంగా ఇందలవాయి మండలంలోని 23 గ్రామాలు, డిచ్ పల్లి మండలంలోని 20 గ్రామాలు, కోటగిరి మండలంలో 8 గ్రామాలు, పొతంగల్ మండలంలోని 5 గ్రామాలు, వర్ని మండలంలోని 5 గ్రామాలు, రుద్రూర్ మండలంలోని 5 గ్రామాలు మొత్తంగా 64 గ్రామాలలో రథయాత్రను చేపట్టి ప్రజలకు బాల్యవివాహాల వలన కలిగే నష్టాలను వాటి వలన ఏర్పడే ఇబ్బందులను అవగాహన కల్పించారని సాధనా స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డి.వినేష్ కుమార్ తెలియజేశారు. రథయాత్ర మూడు జిల్లాల్లో నిర్వహించడం జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో రథయాత్ర సందర్భంగా చక్కని ప్రచారాన్ని అందించిన, సహకరించిన మీడియా మిత్రులకు, జిల్లా, మండల స్థాయి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రథయాత్ర ముగింపు రోజున 8 మంది మహిళలకు చక్కని ప్రతిభను కనబరిచిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా బాధ్యులు రాజకుమార్ సుబేదారి, డిఎల్ఎస్ఎస్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
