29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కల్దుర్కి పోశెట్టి (57) అను వ్యక్తి ప్రమాదవశాత్తు గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. కల్దుర్కి పోశెట్టి అను వ్యక్తి ఈనెల 8 న అక్బర్ నగర్ గ్రామంలోని ఎర్రకుంట చెరువు కట్ట పక్కన ఉన్న పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడని, తిరిగి రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి చుట్టుపక్కల ఎంత వెతికిన ఎక్కడ కూడా కనిపించలేదని, సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తమ్ముడు లక్ష్మణ్, చిన్నాన కొడుకు గణేష్ లు పొలం పక్కన ఉన్న ఎర్రకుంట చెరువు వద్దకు వెళ్లి చూడగా చెరువులో మృతదేహం కనిపించిందన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని చెరువు నుండి బయటకు తీయించి మృతదేహాన్ని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుని కొడుకు కల్దుర్కి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

More articles

Latest article