27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యువకుని అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేసు నమోదు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే అజయ్ కుమార్ (25) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే కాంతాబాయి ఈ నెల 4వ తేదీన కోపర్గ గ్రామానికి పొలం పనికి వెళ్ళగా, సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు అజయ్ కుమార్ ఇంట్లో లేడని, తిరిగి ఇంటికి రాకపోయేసరికి రెండు ఫోన్ లకు కూడా సంప్రదించగా, ఫోన్ లు స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఆ రోజు నుండి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో సోమవారం రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, తల్లి మోరే కాంతాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

More articles

Latest article