27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దళితులకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి దళిత కుటుంబానికి ఎస్సీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్ అన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాల అమలుకై రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న పిలుపు మేరకు జిల్లాలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి సోమవారం కలెక్టర్ కి మెమొరాండం అందజేశారు. ఎస్సీ సంక్షేమ పథకాలు అంబేద్కర్ అభయహస్తాం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం అందించాలని, మూడు ఎకరాల సాగు భూమిని కేటాయించాలని, రిజర్వేషన్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఉచిత విద్యను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేట్ శాఖకు 15 వేల కోట్లు కేటాయించి సబ్సిడీ రుణాలు అందించాలని, దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్మెంట్ భూములు తిరిగి వారికి ఇవ్వాలని కోరారు. ఈ నెల 9 నుండి 30 వరకు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ప్రతి గ్రామ గ్రామాన తిరిగి ఈ అంశాల పట్ల పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామన్నారు. అదే విధంగా మార్చి 30 న నిరాహార దీక్షను విజయవంతం చేస్తామని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లా మరి సుధాకర్, కోర్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, బోధన్ టౌన్ అధ్యక్షులు బిల్లుడి సుధాకర్, బోధన్ ఇన్ చార్జీ వీరపురం పోశెట్టి, సీనియర్ నాయకులు లింగన్న, ఎడపల్లి మండల అధ్యక్షులు సామెల్, ఉపాధ్యక్షులు అశోక్, మోపాల్ మండల్ అధ్యక్షులు ఎల్లయ్య, ఒడ్డెన్న, సాయిలు, ముసరా, మండల అధ్యక్షులు సాయిలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు లతక్క, టౌన్ అధ్యక్షురాలు గంగామణి, అనిత, లత తదితరులు పాల్గొన్నారు.

 

SC welfare schemes should be implemented for Dalits

 

More articles

Latest article