26.6 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెల కొనసాగుతున్న సందర్భంగా మైనారిటీ సోదరుల కొరకు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖిల్లా రోడ్ లో హాస్మి మస్జిద్ ఎదురుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విందులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటున్నారని తెలిపారు. కావున నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని మైనారిటీ సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొనగలరని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అబుద్ బిన్ హందాన్, నయీం శర్హన్, కుద్దుస్, పాప ఖాన్, మెయిన్, అన్వర్, కరీం, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article