24.1 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం

 

నందిపేట్, బతుకమ్మ :

 

గ్రామ అభివృద్ధి, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ మహిళా వర్కర్లను జీపీ పాలకవర్గం తరపున సన్మానించారు.

 

The role of women is crucial in village development.

 

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మహిళల సేవలు ఎంతో గొప్పవని తెలిపారు. మహిళలు సమాజ అభివృద్ధిలో ముందుండాలని, వారికి ప్రతి రంగంలో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

The role of women is crucial in village development.

 

More articles

Latest article