24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బ్రాహ్మణుల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 50 వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ

 

బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని 50 వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి తెలియజేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని 50 వ డివిజన్ కి కార్పొరేటర్ గా గెలుపొందిన ఏకైక బ్రాహ్మణ ముద్దుబిడ్డ జగదీష్ కులకర్ణి ని శనివారం ఘనంగా శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ అధ్యక్షులు శశికాంత్ కులకర్ణి, ప్రధాన కార్యదర్శి రమేష్ కులకర్ణి, పూర్వాధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్, కోశాధికారి మిలింద్, ఐబీఎస్ఎస్ కార్యవర్గం గౌరవాధ్యక్షులు అజయ్ సంఘవాయ్, వెంకట్ రావు కులకర్ణి, టీబీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, కోస్లి చంద్రశేఖర్, పుల్కల్ రమేష్, రత్నాకర్, అడ్వకేట్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article