. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో మౌఖిక విచారణల కేసుల పెండింగ్ మేళా (ఓఈ) నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. శనివారం మున్సిపల్ కమిషనరేట్ లోని డీసీఆర్ బిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 17 మౌఖిక విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని పకడ్బందీగా విచారించి రిపోర్టు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ మేళా లో మూడు మౌఖిక దర్యాప్తులు ముగిసినందున వెంటనే దర్యాప్తు సారాంశాన్ని పంపించవలసిందిగా ఆదేశించారు. అదే విధంగా మిగతా వాటిని కూడా తొందరగా విచారించి వాటి సారాంశాన్ని పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మౌఖిక దర్యాప్తు మేళాలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సి.టి. సి ఎ.సి.పి లు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారులు అదేవిధంగా కక్షిదారులు హాజరయ్యారు.

