29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . క్రమశిక్షణతో చదువుకోవాలి

 

. . . విజ్ఞాన విహార యాత్రను ప్రారంభించి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాసర విజ్ఞాన విహార యాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రణాళిక బద్దంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాయాలని తెలిపారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు విద్యార్థుల పై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందజేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.

More articles

Latest article