బాన్సువాడ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య డ్రైవ్ వంటి పలు కార్యక్రమాలు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ కేంద్రంలోని 13 వార్డులో నిర్వహించిన కార్యక్రమాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు కావడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఖలేఖ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ కౌన్సిలర్ కాసుల రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
