30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బోనాల పండగతో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆనందోత్సహం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఘనంగా అమ్మవారికి బోనాల సమర్పణ

 

ఇందల్వాయి, బతుకమ్మ

 

ఇందల్వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు బోనాల పండగ జాతరను ఘనంగా నిర్వహించారు. బోనాల పండగ జాతరను పురస్కరించుకొని ఇంటింటికి బోనాలతో డప్పు వాయిద్యాలతో, పోతురాజుల విన్యాసాలతో, వేప కొమ్మల నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల జాతర లో మహిళలు పూనకాలతో ఊగిపోయారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించి నైవేద్యం సమర్పించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు గొల్ల రాంబాబు, జెగ్గ గంగాదాసు, ఎడపల్లి పెద్ద నడిపి సాయిలు, మోచ్చే సాయిలు, సూకురు రాజయ్య, బెస్త గంగాధర్ ముకుందం, మంగళి దాసు, కమ్మరి గంగాధర్, ఆశమ్మ కృష్ణ, లక్ష్మణ్, మాదరి నరేష్, తలారి బిక్షపతి, రాజు, కమ్మరి నిఖిల్, కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల పండగను విజయవంతం చేశారు.

Double bedroom beneficiaries rejoice with Bonala festival

 

More articles

Latest article