24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ

 

నందిపేట్ మండల కేంద్రం లో బుధవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన పెంట సాయన్న మారంపల్లి లో గురువారం జరగబోయే నిశ్చితార్ధానికి హాజరయ్యేందుకు వస్తున్నాడు. అదే సమయంలో నందిపేట్ మండల్ వన్నెల్ నుండి మగ్గిడి వెళ్లే బైపాస్ రోడ్డులో వేగంగా స్ప్లెండర్ బైక్ పై మద్యం సేవించి ఎదురుగా వస్తున్నా బైక్ ను ఢీ కొనడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనాన్ని నిర్లక్ష్యం గా నడిపిన నిందితుడు సందీప్ వన్నెల్ కే గ్రామం లో ఇటుక బట్టిలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ శ్యామ్ రాజు తెలిపారు.

More articles

Latest article