28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీబీఎస్ఈ పాఠశాల పేరుతో తల్లి దండ్రులని మోసం చేస్తున యాజమాన్యాలు

 

. . . టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి మెమోరాండం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో సీబీఎస్ఈ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ, భవన నిర్మాణం పూర్తికాకముందే అడ్మిషన్లు ఇస్తూ, అనుమతులు లేకుండా విద్యా చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణిలో అఖిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సీబీఎస్ఈ పేరుతో తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ రోడ్లపై పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నాయని, భవనాలు పూర్తి కాకముందే వందలాది మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా నారాయణ సీబీఎస్ఈ, చైతన్య సీబీఎస్ఈ, అల్ఫోర్స్ సీబీఎస్ఈ వంటి సంస్థల పేర్లతో జిల్లాలో అనేక చోట్ల అనుమతులు లేకుండా బ్రాంచ్‌లు ప్రారంభించి విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమాల వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. కనీస మౌలిక వసతులు లేకుండానే అడ్మిషన్లు ఇస్తున్న యాజమాన్యాలపై తక్షణమే విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధు, సోనూ, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article