26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టి.ఎన్.జి.ఓస్ ఎల్లారెడ్డి యూనిట్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టి.ఎన్.జి.ఓస్) ఎల్లారెడ్డి యూనిట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని టి.ఎన్.జి.ఓస్ సెంట్రల్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎన్.జి.ఓస్ సెంట్రల్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, సెంట్రల్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ సంయుక్తంగా ఎల్లారెడ్డి యూనిట్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా నాయకులు నారాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎల్లారెడ్డి యూనిట్ తరఫున అధ్యక్షులు ఎల్. మహిపాల్, కార్యదర్శి వి. శరణ్ కుమార్, ఖజాంచి ఎం. రవీందర్, కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా సంఘ నాయకులు రాజాగౌడ్, శంకరయ్య  పాల్గొని కార్యక్రమానికి విశేష సహకారం అందించారు. ఈ సందర్భంగా సెంట్రల్ అధ్యక్షులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి యూనిట్ ఐక్యత, సంఘపట్ల నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ ప్రధాన కార్యదర్శి కేంద్ర, జిల్లా, యూనిట్ స్థాయిల మధ్య సమన్వయం పెంపొందించుకోవడం ద్వారా సంఘ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, జిల్లా నాయకులు, యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేశారు.

More articles

Latest article