28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కవితని నిర్దోషిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ

 

ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు కల్వకుంట్ల కవిత ని నిర్దోషిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయమని తెలంగాణ శంకర్ అన్నారు. కవితను నిర్దోషిగా ప్రకటించడం తో తెలంగాణ జాగృతి కార్యాలయం వద్ద పటాకులు పేల్చి సీట్లు పంచుకున్నారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ సత్యమేవ జయతే అనే పదం నేడు నిర్ధారణ అయిందన్నారు. డాటర్ ఆఫ్ ఫైటర్, తెలంగాణ జాగృతి నాయకురాలు, బెస్ట్ పార్లమెంట్ అవార్డు గ్రహిత, తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ బోనాలు పండుగ చేసినటు వంటి కవిత ను నిర్దాక్ష్యిణ్యంగా జైల్లో బంధించినప్పటికీ ఏమి సాధించలేకపోయారన్నారు. భవిష్యత్తులో జాగృతి ద్వారా ఆమె మార్గంలో నడుస్తూ కవితను రాష్ట్ర ముఖ్యమంత్రి గా చేయాలనేది మా ఆకాంక్ష అని తెలిపారు. అనంతరం కరిపి రాజు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ కుట్ర పూరితంగా రాష్ట్రంలో ఉన్న అర్వింద్ ఓడిపోతాడన్న భయంతో ఆమెపై అనవసర నిందలు మోపి జైలు పాలు చేశారని, అయినా సరే చివరికి ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి అర్వింద్ పతనం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవంతి రావు, దొంతు ప్రవీణ్, మనోజ్ కుమార్, జాదవ్ రాజ్, హితంబర్ శేఖర్, రాజ్, రేఖ, సరిత, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

 

It is a very happy thing that Kavitha has been acquitted.

 

More articles

Latest article