29 C
Hyderabad
Monday, August 3, 2026

మాతృభాషల తోనే వికాసం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్రీయ పండిత పరిషత్ సభలో డీఈఓ పి.అశోక్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

విద్యా జీవితంలో ఎన్ని భాషలు నేర్చుకున్న మాతృభాషతోనే హృదయ వికాసం కలుగుతుందని దాని వలన జీవితం సుసంపన్నమౌతుందని డీఇవో పి.అశోక్ అన్నారు. గురువారం జిలా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో ప్రతిభా పాటవా పరీక్షలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతిలను అందజేశారు. రాష్ట్రీయ పండిత పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు జమీలుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో అన్ని విషయాల మీద ప్రత్యేక దృష్టిని ఉంచాలని, పరీక్షల లోపు ఈ మధ్యకాలంలో చేసే అభ్యాసమే అధిక మార్కులు సాధించడానికి దోహదం చేస్తుందన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సాధించడానికి దోహదం చేసే ఇలాంటి ప్రతిభాపోటీలను నిర్వహించడం సంతోషదాయకమని నిర్వాహకులను అభినందించారు. విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు. అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్బంగా జరిగిన ఈ కార్యక్రమం లో ప్రధాన వక్త, ప్రముఖ పద్యకవి తల్లావజ్ఝల మహేశ్ బాబు మాట్లాడుతూ మాతృభావన భారతీయ సంస్కృతి లో భాగమనీ అందులో ప్రధానమైనది మాతృభాష అని అన్నారు. మాతృభాషలో పట్టును సాధించిన వారికి జీవితం మీద పట్టును, వికాసాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సభలో మల్లారం ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ కవి డాక్టర్ గంట్యాల ప్రసాద్ రచించిన తెలుగు వెలుగు శతకం పుస్తకాన్ని డీఇవో ఆవిష్కరణ చేసారు. ఈ సభలో పండిత పరిషత్తు రాష్ట్ర, జిల్లా బాధ్యులు కె.వి.రమణాచారి, ఘనపురం దేవేందర్, గంట్యాల ప్రసాద్, డాక్టర్ ఓంప్రకాశ్ బోచ్కర్, శివనాగమణి, షాలి అరుణోదయ, అపర్ణ, డా.మక్బుల్ హుస్సేన్, మహ్మద్ అబ్దుల్ అజీమ్, వ్యాస్, ప్రవీణ్ శర్మ, కోకిల నాగరాజు, శ్రీనివాస్, శ్రీమన్నారాయణ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో జిల్లా వ్యాప్తంగా రెండువందల పైగా మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి ప్రతిభ పోటీలలో విజేతలుగా తెలుగులో ప్రథమ బహుమతిని సిర్పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం. మాధురి, ఎం. హరిణి, రెండవ బహుమతులు నిహారిక, అభినయ్, అక్షయ, శ్రావ్య, ప్రణతి, అభిత గెలుచుకున్నారు. హిందీలో ప్రథమ బహుమతి సిహెచ్ జ్యోతిక, కేజీబీవీ రుద్రూర్, రెండవ బహుమతులు ఏ.మోక్ష, ఫాతిమార గౌస్, సాన్విక, సిద్ధార్థ, వైశాలి, భవ్యశ్రీ గెలుచుకున్నారు. ఉర్దూలో గవర్నమెంట్ హై స్కూల్ ఖలీల్ వాడి మహీన్ ప్రథమ బహుమతిని, రెండవ బహుమతులను శుభాశీర్దోస్, ఆఫిఫానాస్, జబియా సిమాబ్, లైబా ఫిర్దోజ్ గెలుచుకున్నారు.

 

Development through mother tongues

 

More articles

Latest article