30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ముఖానికి మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన కోటగిరి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో మహిళలు భయాందోళన చెందుతున్నారు. ఎస్సై సునీల్​ తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్​కు చెందిన ఏముల లింగవ్వ (65) 25న రాత్రి ఇంట్లో ఒక్కరే ఉండగా ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి గోడదూకి వచ్చి వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article