27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హిందువులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హిందువులపై దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా బాన్సువాడ, రుద్రూర్, ఇందూర్ అర్బన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాలలో కొంత మంది ముష్కరులు హిందువులపై ఉద్దేశ్యపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని, ఈ విషయమై స్థానిక పోలీసు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకుంగా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ దాడుల గురించి, అసాంఘిక శక్తుల అరాచకాల గురించి స్థానిక పోలీసు అధికారులకు బాధితులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికి వారి వైపు నుండి కనీస స్పందన లేదని తెలిపారు. స్థానిక పోలీసులు పక్షపాత ధోరణితో బాధ్యతరహితంగా వ్యవహరించడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరి వల్లే దాడులు చేసేవారికి మరింత ప్రోత్సాహం లభించి, శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని, హిందువులపై దాడులకు పాల్పడిన ముష్కరులను వారికి వెనకుండి సహకరిస్తున్న శక్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల నుండి ఫిర్యాదులు వచ్చినప్పటికి స్పందించకుండా విధి నిర్వహణలో ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక పోలీస్ అధికారులపై ఉన్నత స్థాయి విచారణ జరిపి వారిపై వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులు జరుగుతున్న సున్నితమైన ప్రాంతాలలో తక్షణమే అదనపు పోలీసు బలగాలను మోహరించి భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందువులకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, అశోక్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం రాజు, ఇందూర్ జిల్లా ప్రభారి కాంతారావు, కామారెడ్డి జిల్లా ప్రభారి విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆంటోనీ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ ఉన్నారు.

More articles

Latest article