29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు.. ప్రాణానికి రక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్ బతుకమ్మ  :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం వాహనదారులకు ఎస్సై సాయన్న హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు.. ప్రాణానికి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు ఎస్సై అభినందిస్తూ పుష్పం అందజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article