కమ్మర్ పల్లి, బతుకమ్మ :
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను అటవీశాఖ అధికారులు మంగళవారం రోజున పట్టుకున్నారు. మండలంలోని కొనాపూర్ వాగు నుండి చౌట్ పల్లి గ్రామానికి ఇసుక తరలిస్తుండగా కమ్మర్ పల్లి మండల రేంజ్ ఆఫీసర్ రవీందర్ పట్టుకున్నారు. రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని, కేసు నమోదు చేశామని ఇకపై అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

