బాన్సువాడ, బతుకమ్మ :
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) డైరీనీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, సమాజం అభివృద్ధి కి పాటు పడుతున్న జర్నలిస్టుల కోసం ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు)ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఏ లతీఫ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాజేష్, పోశిరాం, చంద్రశేఖర్, శ్రీనివాసరావు కులకర్ణి, మోహిన్, యూనుస్, సుధీర్ కుమార్, మహేష్ కుమార్ జర్నలిస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
