. . . జుక్కల్ సర్పంచ్ శ్రీనివాస్
జుక్కల్, బతుకమ్మ :
గ్రామ ప్రజలే కాబోయే ఎమ్మెల్యే, ఎంపీ అవుతారని జుక్కల్ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం మంగళవారం ఆయన గ్రామ సభను నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మండలంలో మొదటి స్థానంలో ఉంచుతానని పేర్కొన్నారు. గతంలో ఉన్న సర్పంచ్ మన గ్రామాన్ని సరిగా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఇక పైన ఎలాంటి సమస్యలు ఉన్న తెలియ జేయాలని ఆయన ప్రజలను కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే తను రాజకీయాల్లోకి వచ్చినట్టు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా రాజకీయాల గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఎవరైనా రాజకీయాల్లో పోటి చేయవచ్చని ఆయన తెలిపారు. అలాగే గ్రామంలో పెద్ద సమస్యగా ఉన్న బావి ని త్వరలోనే ముసివేసేలా చర్యలు తీసుకుంటానని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ పంచాయతి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

