నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర సేవికా సమితి ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పథ సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తేజస్వి హిందూ రాష్ట్ర పునర్నిర్మాణంకై 89 సంవత్సరాలుగా రాష్ట్ర సేవికా సమితి మాతృశక్తి సంఘటనకై శాఖ మాధ్యమంగా వ్యక్తిత్వ నిర్మాణం గావిస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం ఏకరూప గణవేష్ ధారణతో కదం కదం కలుపుతూ, మహిళాశక్తిని జాగృతం చేస్తూ, ఇందూర్ పురవీధులలో భవ్యమైన పథసంచలన్ తో పాటు మాతృశక్తిని సంఘటితం చేయుటకు సార్వజనికోత్సవం నిర్వహించారు. నగరంలోని కోటగల్లి చౌరస్తాలో పల్నాటి కార్తీక్ కుమార్ ఆధ్వర్యంలో పథసంచలన్ చేస్తున్న వారికి తేజశ్రీ, విఘ్నేష్, ఆరుష్, జగన్, రాకేష్ రాంచందర్ లు పూలతో స్వాగతం పలికారు.

ఈ పథ సంచలన్ నగరంలోని మాణిక్ భవన్, శివాజీ మహారాజ్ చౌరస్తా, శిశుమందిర్ రోడ్, మైసమ్మ గుడి, మార్కండేయ గుడి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆర్యసమాజ్, పెద్ద బజార్ రోడ్, పోత లింగయ్య గుడి, గీతా భవన్ వరకు పథసంచలన్ చేశారు.
