రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో పథ సంచలన్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర సేవికా సమితి ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పథ సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తేజస్వి హిందూ రాష్ట్ర పునర్నిర్మాణంకై 89 సంవత్సరాలుగా రాష్ట్ర సేవికా సమితి మాతృశక్తి సంఘటనకై శాఖ మాధ్యమంగా వ్యక్తిత్వ నిర్మాణం గావిస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం ఏకరూప గణవేష్ ధారణతో కదం కదం కలుపుతూ, మహిళాశక్తిని జాగృతం చేస్తూ, ఇందూర్ పురవీధులలో భవ్యమైన పథసంచలన్ తో పాటు మాతృశక్తిని సంఘటితం చేయుటకు సార్వజనికోత్సవం నిర్వహించారు. నగరంలోని కోటగల్లి చౌరస్తాలో...