29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని, ముందుగా మీరు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్.ఆర్ భవన్ లో బుధవారం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతాంగం తమ సమస్యల పరిష్కారం కొరకు దేశ రాజధాని సరిహద్దుల్లో సమరశీల రైతు ఉద్యమం నిర్వహించారని, ఆ రైతు ఉద్యమంలో ప్రధానంగా ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని, రైతుల అప్పును మాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేయాలని విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని అన్నారు. ఆ ఉద్యమానికి తలవంచిన ప్రధాని మోదీ వాటిని పరిష్కరిస్తామని, పార్లమెంటులో చర్చిస్తామని, లిఖితపూర్వకంగా హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని అమలు చేయకపోగా కొత్తగా విత్తన చట్టం, విద్యుత్ చట్టం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టాన్ని స్థానములో “జి రామ్ జి” చట్టాలు తీసుకువచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన ఈ చట్టాలు అటు రైతాంగం పై, ఇటు వ్యవసాయ కార్మికులపై మెడ మీద వేలాడ తీసే కత్తిలా ఉన్నాయని భూమయ్య అన్నారు. అలాగే గత సంవత్సరం రాష్ట్రస్థాయి రైతు మహోత్సవం జిల్లాలో నిర్వహించిన సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టులలో చేరిన పూడికతీత పనులు త్వరలో చేపడుతామన్నారని, ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభించనే లేదని గుర్తు చేశారు. ఈ నెల 16 న జిల్లాకు వచ్చిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మళ్లీ అదే మాట, అదే పాట పాడడం రైతులను తప్పుదోవ పట్టించడం కాదా అని భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాదు జిల్లాలో ఉన్న ఎన్.ఎస్.ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని రైతులకు హామీ ఇచ్చారని, అందుకు అసెంబ్లీలో సబ్ కమిటీని వేశారన్నారు. ఆ సబ్ కమిటీ చక్కర పరిశ్రమలను పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్టు కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ ఎన్.ఎస్.ఎఫ్. చక్కర ఫ్యాక్టరీని తెరపించడం లేదని, దాని గురించి పట్టించుకోవడం కూడా లేదని, మరి ఇది జిల్లా రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఈ రకంగా రైతులను హామీలతో ముంచెత్తి ఆచరణలో మొండి చెయ్యి చూపెట్టడం తప్ప మరొకటి కాదని అన్నారు. ఇప్పటికైనా మీరిచ్చిన హామీలను అమలు చేయాలని వారు ప్రభుత్వాలను కోరారు. జిల్లాలో యూరియా కొరత వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సన్నా, చిన్న, పేద రైతులకు స్మార్ట్ ఫోన్, పెద్ద ఫోన్లు ఉండవని వారికి యాప్ ద్వారా తీసుకోవడం కష్టంగా ఉంటుందని, వీరి వద్ద పాస్ బుక్కులను చూసి యూరియా ఇవ్వాలని అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు బి సాయిలు, ఎల్.పర్వన్న, సహాయ కార్యదర్శి లు బి.గోపాల్, విట్టల్, జిల్లా నాయకులు పోచన్న, దేవన్న, రాపాని గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article