26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జేఈఈ మెయిన్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఎస్ఆర్ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదల కాగా జిల్లాలోని ఎస్.ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ పర్సంటేజ్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. కళాశాలకు చెందిన ఎస్.విశ్వ అక్షయ 99.06, ఎ.చరణ్ తేజ 98.65, ఎం.నివాస్ రెడ్డి 97.30, జి.రాజశ్రీ 95.75, డి.వర్షిత్ 94.94, ఆర్.అభినయ్ 94.62, కె.మోక్షిత 93.26, ఆర్.అభ్యుదయ్ 98.38 పర్సంటేజ్ సాధించారు. మొత్తం కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు 90 శాతం పైగా పర్సంటైల్ సాధించినట్టు ఎస్ డీజీఎం గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ అనుభవం ఉన్న ఎస్.ఆర్ అధ్యాపకులు, కరికులం, మెటిరీయల్స్, ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా ఐఐటీ ప్రోగ్రామ్స్ లో ఫోకస్ ల్యాబ్ ,స్పార్క్ బ్యాచ్ ల ద్వారా విద్యార్థులను జాతీయ స్థాయి పరీక్షలైన ఐఐటీలకు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ రాంబాబు, ప్రిన్సిపాల్స్ హన్మంత్ రావు, అజేందర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,మురళిధర్,నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడతా : విశ్వక్షయ

తాను భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడుతానని విశ్వాక్షయ అన్నారు.  జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.06 పర్సంటేజ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు అనురాధా, రాజశేఖర్, కళాశాల లెక్చర్లర్ల ప్రోత్సాహంతో మెయిన్ ఫలితాల్లో 99.06 పర్సంటేజ్ సాధించినట్టు తెలిపారు.

 

sr-students-excel-at-the-national-level-in-jee-main-results

ఐఏఎస్ లక్ష్యం : చరణ్ తేజ్

భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని చరణ్ తేజ అన్నారు. బాల్కొండ మండలం కేంద్రానికి చెందిన చరణ్ తేజ ఎస్ఆర్ కళాశాలలో మంచి ప్రావీణ్యం సాధించి తన తల్లిదండ్రులు లావణ్య, చాణక్యలు, కళాశాల యజమాన్యం, లెక్చరర్ల సహకారంతో జేఈఈ మెయిన్ లో  98.65 పర్సంటేజి సాధించినట్లు తెలిపారు.

 

sr-students-excel-at-the-national-level-in-jee-main-results

 

సాఫ్ట్ వేర్ అవుతా : నివాస్ రెడ్డి

భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వడమే తన కల అని నివాస్ రెడ్డి అన్నారు. ధర్పల్లి మండలానికి చెందిన తను జేయియి మెయిన్స్ లో 97.30 పర్సంటేజ్ పొందడానికి తన తల్లిదండ్రులు స్రవంతి, శ్రీనివాస్ రెడ్డి లు సహాకారం, అలాగే కళాశాల లెక్చరర్ల భోదనలే కారణం అని తెలిపారు.

 

 

sr-students-excel-at-the-national-level-in-jee-main-results

More articles

Latest article