. . . ఒక్కొక్కరికి రూ.1,100 జరిమానా
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా వారికి ఒక రోజు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,100 జరిమానా విధించినట్లు ఎస్ హెచ్ వో బి.మహేష్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ గడ్డం లక్ష్మయ్య, రెడ్డి రాజేష్, ఉదాత సాయిలు, బండమీద సాయిబాబు, కత్రోజ్ రాజులకు కోర్టులో హాజరుపర్చగా జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సుష్మా వారికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్ హెచ్ వో హెచ్చరించారు.
