27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడ మున్సిపాలిటీలో పోలింగ్ జోరు.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ​శాంతియుతంగా పోలింగ్

 

. . . సజావుగా ఓటర్ల ఉత్సాహం

 

బాన్సువాడు, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని ఎన్నికల అధికారి తెలిపారు. పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు వరుసల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article