27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పీహెచ్ సీ సిబ్బంది సమయపాలన పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

క్షేత్రస్థాయిలో సిబ్బంది అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమయపాలన పాటించాలని, వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా పిహెచ్సి స్థాయిలో డివిజన్ స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనీ ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఆశాల ద్వారా కుష్టు నియంత్రణ కై చేయి ఇస్తే ఎల్సిడిసి సర్వే పెండింగ్లో ఉన్న పి హెచ్ సి లో త్వరగా పూర్తిచేయాలని, ప్రతి ఆశా గృహ సందర్శనలో భాగంగా స్పర్శ లేని మచ్చలను గుర్తించాలని కోరారు. క్షయ నియంత్రణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎక్స్రే నిర్ధారణ పరీక్షలు చేయాలని అన్నారు. మాతా,శిశు ఆరోగ్యాన్ని కాపాడుతూ మాతృ మరణాలు, శిశు , చిన్నపిల్లల మరణాలు జరగకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలందరికీ నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న గర్భిణీ స్త్రీల జాబితాలను సేకరించి ఫాలో అప్ చేయాలన్నారు. ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రత్యేక పర్యవే క్షణ చేయాలని, ప్రసవ ప్రణాళికను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. అర్హులైన శిశువులందరికి 100% వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని పెండింగ్ లో ఉన్న శిశువుల జాబితా సేకరించి పర్యవేక్షణ చేయాలన్నారు. జీవన శైలి వ్యాధుల నియంత్రణలో మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో పెండింగ్ లేకుండా ఎంట్రీ చేయాలని, పాల్యేటివ్ కేర్ లో ఓపి, ఐపి, గృహముల వద్ద చికిత్స పొందిన వారి పేర్లతో కూడిన జాబితాను తయారు చేయాలన్నారు. డివిజన్ల వారీగా ఉన్న స్కానింగ్ కేంద్రాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫార్మ్ ఎఫ్ ఆడిట్ చేయాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎస్ ఫామ్, పిహెచ్సిలో ఎల్ ఫామ్ లో ఎంట్రీ జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా రిఫరల్ చిల్డ్రన్స్ యొక్క జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని, సామ్ మామ్ చిల్డ్రన్స్ ను పిహెచ్సి నుండి పోషకాహార లోప నివారణ చికిత్స కోసం అవసరమైన వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎన్నార్సికి రిఫర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్, డి టి సి ఓ డాక్టర్ దేవి నాగేశ్వరి, జిల్లా ఉపవైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సమత, డాక్టర్ అశ్విని, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ, డాక్టర్ సామ్రాట్, డాక్టర్ శిఖరా, డాక్టర్ చైతన్య, డాక్టర్ శ్రావ్య, పీఎంఓ రూప, డిహెచ్ఇ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

 

PHC staff should be punctual

More articles

Latest article