27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ ని అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సీఎం రోడ్, బోధన్ రోడ్, గోశాల రోడ్, మైనార్టీ పాఠశాలలు కట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, జిల్లాని అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల అన్నారు. జిల్లా కేంద్రంలోని పులాంగ్ వద్ద 46వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ నాయబ్ పాషా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఆడబిడ్డలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి రూ.1 లక్ష 116 తో పాటు తులం బంగారం ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, రూ.200 ఉన్న పెన్షన్ కేసీఆర్ రూ.2000 చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4000 ఇస్తానని చెప్పారన్నారు. ఈ హామీలన్ని ఇస్తే కాంగ్రెస్ కి ఓటు వేయండి. లేదంటే కేసీఆర్ కు ఓటు వేయండని ఆయనన్నారు. నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచారని, హైదరాబాద్ తరహాలో మినీ ట్యాంక్ బండ్ నిర్మించారన్నారు. ధన్ పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచి నిజామాబాద్ నగరానికి ఏమైనా చేశారా అని నిలదీశారు. 25 కిలోమీటర్ల వరకు సెంటర్ లైటింగ్, చెట్లు పెట్టడం జరిగిందని, ఇప్పుడు చెట్లకు నీళ్లు లేవు.. పోల్స్ కి బల్బులు లేవని ఎద్దేవా చేశారు. నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, హైమద్ పుర మార్కెట్ ని నిర్మించడం జరిగిందని, కానీ కాంగ్రెస్, బిజెపి నాయకుల అసమర్ధతతో అది ప్రారంభానికి నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే మాత్రం గల్లి గల్లి లో దుకాణాలు ప్రారంభించుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడని, నాకు ఎలాంటి వ్యాపారం లేదు అయినా కూడా 20,000 మందికి కళ్యాణ లక్ష్మి, శాదిముబారక్ చెక్కులతో పాటు నా సొంత ఖర్చుతో వధూవరులకు బట్టలు పెట్టడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. నూతన కలెక్టరేట్, ఐటి హబ్, సమీకృత మార్కెట్లు, హైమద్ పుర మార్కెట్లు నిర్మిస్తే కనీసం వాటిని వాడుకోవడానికి కూడా చేతకాలేదని అన్నారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 46 వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ నాయబ్ పాషా, నవీద్ ఇక్బాల్, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్, జగత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

 

 

Only BRS has developed Nizamabad.

More articles

Latest article