27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 1 లో నివాసం ఉండే భథాక్ సందీప్ (24) మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంట్లో అనవసరంగా గొడవ పడుతుండేవాడని, శుక్రవారం రోజు రాత్రి ప్రతి రోజు మాదిరిగానే ఇంట్లో గొడవపడి చనిపోతానని బెదిరించాడు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సముదాయించగా శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అమ్మమ్మ కాలకృత్యాలకు నిద్ర లేచి ఇంటి బయటికి వచ్చి చూడగా మృతుడు రేకుల షెడ్డులో చున్నీతో ఉరేసుకొని మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు.

More articles

Latest article