ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

  బాన్సువాడ, బతుకమ్మ :   ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 1 లో నివాసం ఉండే భథాక్ సందీప్ (24) మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంట్లో అనవసరంగా గొడవ పడుతుండేవాడని, శుక్రవారం రోజు రాత్రి ప్రతి రోజు మాదిరిగానే ఇంట్లో గొడవపడి చనిపోతానని బెదిరించాడు....