భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూర్ పట్టణ గ్రామ పంచాయతీ రికార్డులను డీపీవో మురళి శనివారం తనిఖీ చేశారు. పంచాయతి కార్యదర్శి మహేష్ గౌడ్ తో మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ అవుతున్నందున, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న పనుల బిల్లులు, వోచర్లు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిధుల వినియోగం జరగాలన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, నిధులు వచ్చిన వెంటనే పనుల చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్యలు, పైపులైన్లు, కుళాయిలు వద్ద నీరు వృధా కాకుండా లీకేజీలను తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. గ్రామ ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
