24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సారెస్పీ నుంచి కొనసాగుతున్న సాగునీరు

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోర, బతుకమ్మ :

 

ఉత్తర తెలంగాణ జిల్లాల వరాప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా యాసంగి పంటలకు ప్రాజెక్టు అధికారులు సాగునీటిని అందిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 24 గంటలలో ప్రాజెక్టు లోకి 688 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 24 గంటలలో 4893 క్యూసెక్కుల నీరు బయటికి విడుదల అవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1084.90 అడుగులు 59.501 టిఎంసీల నీరు నిలకడగా ఉండగా కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3125 , లక్ష్మి కాలువ ద్వారా 250, సరస్వతి కాలువ ద్వారా 600, అలీసాగర్ ఎత్తిపోతలకు 300 క్యూసెక్కుల సాగునీరు అందిస్తూ మిషన్ భగీరథ పథకం ద్వారా అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు 61, కోరుట్ల మీదుగా జగిత్యాల జిల్లాకు 63, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు 107 క్యూసెక్కుల త్రాగునీరు సరఫరా చేస్తూ పూర్తిగా 231 క్యూసెక్కుల త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు నుండి 387 క్యూసెక్కుల నీరు వృథాగా ఆవిరి రూపంలో బయటికి వెళుతుంది అని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.

More articles

Latest article