27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  సహించేది లేదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , బాన్సువాడ : మొహమ్మద్ ప్రవక్త, కుటుంబం పై అనుచిత వాక్యాలను చేస్తే సహించబోమని, నర్సింగ్ ఆనంద్ మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బాన్సువాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మండల అశోక్ కు ఫిర్యాదు చేశారు.బాన్సువాడ పట్టణంలోని ముస్లిం మైనారిటీలు ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్ కు చెందిన నర్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూన్నమన్నారు. అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ లో ఉన్న నర్సింగ్ ఆనంద్ అనే పూజరి ముస్లింలకు ప్రియమైనటువంటి  మహమ్మద్ ప్రవక్త గురించి అవమానకర, తప్పుడు వ్యాఖ్యలు ముస్లిం మైనారిటీల మనస్సులను గాయపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. దీనివల్ల శాంతి యుత వాతావరణంలో మత విద్వేషాలు జరిగే ప్రమాదం ఉన్నదని తెలిపారు.  అలాంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మొహమ్మద్ ప్రవక్త పై చేసిన అనుచిత వాక్యాలకు గాను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడే తీరు పద్ధతులు మార్చుకొని దేశంలో ఉన్న వారంతా కలిసిమెలిసి ఉండే విధంగా చూసే మహారాజ్ లే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకర మన్నారు. ఆయన మాటల్లోనే అశాంతి స్పష్టంగా కనబడుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ అధ్యక్షులు సాయిద్ ఖాన్ , సెక్రటరీ అతిఫ్ అజిమ్,ఎంఐఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

More articles

Latest article