రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు బుధవారం జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి బి.సుధాకర్ గౌడ్ గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం సమక్షంలో పరీక్ష అట్టలను అందజేశారు. గతంలో కూడా సుధాకర్ గౌడ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మునుముందు కూడా ఇలాంటి సేవ భావం కలిగించాలని ఆయన భగవంతున్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
