24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆశీర్వదిస్తే మూడో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

Must read

📰 Generate e-Paper Clip

. . . బీఆర్ఎస్ మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శిరీష నల్చార్ బాలాజీ

 

బిచ్కుంద, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని మూడో వార్డును  అభివృద్ధి చేయడానికి మూడవ వార్డు ప్రజలంతా అవకాశం ఇస్తే.. ప్రజల సేవకుడిలా పని చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి శిరీష నల్చార్ బాలాజీ అన్నారు. కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సేవ చేయడం తన లక్ష్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుల  సూచన మేరకు..  కార్యకర్తల సహాయ సహకారాల సూచనలతో పార్టీ తరఫున బిచ్కుంద మున్సిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా వెల్లడించారు. శిరీష నల్చార్  బాలాజీ మూడవ వార్డు అభివృద్ధికి తోడ్పడుతారని ఆశిస్తూ.. తన స్వంత పనుల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారనే ఉద్దేశంతో కౌన్సిలర్ పదవికి పోటీ చేయించారని అన్నారు. మూడో వార్డు ప్రజల మద్దతుతో ఆదర్శ వార్డుగా తీర్చి దిద్దుతానని శిరీష నాల్చర్ బాలాజీ ఈ సందర్భంగా తెలిపారు.

 

 

More articles

Latest article