26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ సాయం

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో నివాస గృహ పూజ సందర్భంగా వెలిగించిన దీపం కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటి మొత్తం కాలిపోయి, వంట సామాగ్రితో పాటు దుస్తులు కూడా దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబం పూర్తిగా నిరాశ్రయంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి నెలకు సరిపడా వంట సామాగ్రితో పాటు రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జాప్యం లేకుండా వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయం అందించినందుకు బాధిత కుటుంబ సభ్యులు మీర్ ఇలియాస్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article