అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ సాయం
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో నివాస గృహ పూజ సందర్భంగా వెలిగించిన దీపం కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటి మొత్తం కాలిపోయి, వంట సామాగ్రితో పాటు దుస్తులు కూడా దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబం పూర్తిగా నిరాశ్రయంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి నెలకు సరిపడా వంట సామాగ్రితో పాటు...