. . . షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
. . . 2 లక్షలు ఆస్తి నష్టం
బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, వార్డు నెంబర్ 18లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లింగడోళ్ల గంగారాం నివాసంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 లక్షలు రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

