28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన నిజామాబాద్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గొండ దస్తయ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అభినందించిన ఎస్పీ రావుల గిరిధర్

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గొండ.దస్తయ్య సమ్మక్క సారక్క జాతర బందోబస్తులో భాగంగా తాడ్వాయి మండలం కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా మేడారం నుండి సిద్ధిపేట వెళుతున్న బస్సులో సిద్దిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామంలోని కేసీఆర్ నగర్ కు చెందిన శైలేంద్ర సురేష్ యాదవ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతర ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా బస్సులో అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో బస్సు డ్రైవర్ కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద బస్సు నిలిపారు.వెంటనే అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గొండ.దస్తయ్య బస్సులోకి వెళ్లి విషయం తెలుసుకొని అపస్మారక స్థితికి గురైన వ్యక్తిని బస్సులోనే పడుకొ బెట్టి సిపిఆర్ చేయడంతో వ్యక్తి సాధారణ స్థితి రావడంతో అటువైపుగా వెళ్తున్న చెకింగ్ ఆఫీసర్ డిఎస్పి సురేందర్, అడిషనల్ ఎస్పీ భీమ్ రావ్ వెంటనే అంబులెన్స్ ను పిలిపించి అపస్మారక స్థితి నుండి సాధారణ స్థితికి వచ్చిన యువకుడిని అంబులెన్స్ లో ఎక్కించి వరంగల్ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని రూట్ ఇంచార్జి నార్కోటిక్ ఎస్పీ రావుల గిరిదర్ కి సమాచారాన్ని చేరవేశారు.హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులను ఎస్పీ రావుల గిరిధర్ పలకరించడంతో పోలీసు వారు సమయానికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారని వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు ఎస్పీకి తెలపడంతో ఎస్పీ సిపిఆర్ చేసిన హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య ను, సహకరించిన హోంగార్డ్ -741 నవీన్ ను కాటాపూర్ క్రాస్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లు సుభాష్, భాస్కర్ లను అభినందించారు.

More articles

Latest article