భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని 18 గ్రామాల లో పొలిటికల్, నాన్ పొలిటికల్ స్వచ్ఛంద సంస్థల ప్రముఖుల తో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయాలని లాయర్స్ ఫోరం ప్రతినిధులు గజ్జల బిక్షపతి, నంద రమేష్, అతిమాముల శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ భిక్కనూరు మండల లోని అన్ని గ్రామాలను గాలి, నీరు, వాయువు కాలుష్యం నుండి రక్షించుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాభిప్రాయంలో ప్రజలు పేర్కొన్న విధంగా ఫ్యూజన్ కంపెనీ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూజన్ కంపెనీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎం ఎస్ ఎన్ కంపెనీ ద్వారా గాలి నీరు కాలుష్యం అవుతున్నాయని, విషవాయువు వెదజల్లుతున్నాయని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అన్ని గ్రామాల జేఏసీలు ఏర్పాటు అయిన పిదప మండల జేఏసీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
