అన్ని గ్రామాలలో జేఏసీలు ఏర్పాటు కావాలి

భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండలంలోని 18 గ్రామాల లో పొలిటికల్, నాన్ పొలిటికల్ స్వచ్ఛంద సంస్థల ప్రముఖుల తో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయాలని లాయర్స్ ఫోరం ప్రతినిధులు గజ్జల బిక్షపతి, నంద రమేష్, అతిమాముల శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ భిక్కనూరు మండల లోని అన్ని గ్రామాలను గాలి, నీరు, వాయువు కాలుష్యం నుండి రక్షించుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రజాభిప్రాయంలో ప్రజలు పేర్కొన్న విధంగా ఫ్యూజన్ కంపెనీ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్...