25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసుల భారీ బందోబస్త్

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భీంగల్ లో ఎన్నికల సహాయక కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం ఐదు వరకు నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి వాహనాలు, అనుమతి లేని వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థి తో ఇద్దరికీ మాత్రమే అనుమతి ఇచ్చారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భీంగల్ ఇంచార్జి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఏర్గట్ల, భీంగల్ ఎస్సై లు ప్రశాంత్, తిరుపతి బందోబస్త్ ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

 

Heavy police deployment

More articles

Latest article